Apps Latest Tech Uncategorized

గూగుల్ కొత్త పేమెంట్ ఆప్ | గూగుల్ తేజ్

google-payments-app

గూగుల్ త్వరలో తమ స్వంత పేమెంట్ అప్ రిలీజ్ చెయ్యబోతుంది . గూగుల్ తేజ్ అనే పేరుతో ఈ సెప్టెంబర్ 18 న ఈ అప్ లాంచ్ చెయ్యాలని అనుకుంటున్నారు. గూగుల్ ద్వారా ఇప్పటికే  ఆండ్రాయిడ్ పే మరియు గూగుల్ వాల్లేట్ ఉన్నప్పటికీ ఈ తేజ్ ఆప్ ప్రత్యేకంగా భారతీయుల కోసం తయారుచేయబడింది. UPI పేమెంట్ విధానంలో ఈ ఆప్ పని చేస్తుంది . ఈ UPI పేమెంట్ రంగంలో ఇప్పటికే చాలా జాతీయ సంస్థలు అడుగు పెట్టినా అంతర్జాతీయ సంస్థలు ఇంకా అడుగుపెట్టలేదు . whatsapp , ఉబెర్ మొదలైన సంస్థలు తాము కూడా UPI ఆప్ ను తాయారు చేస్తున్నామని ప్రకటించాయి కాని ఇంకా అవి విడుదలకి సిద్దం కాలేదు.

గూగుల్ తేజ్ ఇండియా లో అంతర్జాతీయ సంస్థ విడుదల చేస్తున్న UPI ఆప్ గూగుల్ తేజ్ లో ఇప్పటికే పాపులర్ అయిన paytm, mobikwik పేమెంట్ సర్వీస్ ల అనుసంధానించబడ్డాయి అని అంచనా.

whatsapp కూడా త్వరలో తమ స్వంత పేమెంట్ అప్ ని రిలీజ్ చెయ్యబోతోంది అని సమాచారం . గూగుల్ రిలీజ్ చేసిన వెంటనే రిలీజ్ ప్రకటన ఉండ వచ్చు.


షేర్ చెయ్యండి – కేర్ చెయ్యండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *