Apps Latest Tech Uncategorized

పాస్ వర్డ్స్ గుర్తు ఉండడం లేదా | ఇది మీకోసమే .

lastpass password manager

మనలో చాలా మందికి passwords మర్చి పోయే సమస్య ఉంది. కొన్ని సార్లు యూసర్ నేమ్ కూడా మర్చిపోతూ ఉంటాం . చాలా ఇంపార్టెంట్ అయిన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు సమాచారాన్ని ఏ పేపర్ లోనో రాస్తూ ఉంటాం . ఎందుకంటే వీటి అవసరం తక్కువగా ఉన్నపుడు గుర్తుంచుకోవడం కష్టమే . గుర్తుంచుకున్నా సరే హ్యాకర్ బారిన పడితే అంతే సంగతులు . ఈ మధ్య కాలం లో ఇంటర్నెట్ మోసాలు మనం చుస్తునే ఉన్నాం .

లాస్ట్ పాస్ (lastpass password manager) మీకోసమే . ఇందులో passwords దాచుకోవచ్చు , క్రెడిట్ కార్డు , డెబిట్ కార్డు సమాచారం దాచుకోవచ్చు, మనం పర్సనల్ గా రాసుకునే నోట్స్ ని రాస్కోవచ్చు . ఇవన్ని AES-256 బిట్ encrypt ద్వారా మీ మాస్టర్ పాస్వర్డ్ (ఈ సమాచారని decrypt చేసే కీ )తో మాత్రమే చూడగలిగే విధంగే సురక్షితమైన vault లో భద్ర పరుచుకోవచ్చు . మాస్టర్ పాస్వర్డ్ ని మాత్రమే మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది . అది లేకుండా ఎవ్వరు మీ వ్యక్తిగత సమాచారాన్ని (lastpass కంపెనీ వాళ్ళు కూడా ) చూడలేరు.

lastpass ఎలా ఆక్టివేట్ చేస్కోవాలి ???

lastpass ని మనం లాప్టాప్ లేదా మొబైల్ లో ఉపయోగించుకోవచ్చు .

లాప్టాప్ లో lastpass రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు .

1 . విండోస్ / మాక్ / లినక్సు ప్రోగ్రాము

  1. క్రోమ్ / ఫైర్ ఫాక్స్ / సఫారీ బ్రౌజరు అనుసంధానం ( extension)

  2. మొబైల్ లో ఆండ్రాయిడ్ / iOS అప్లికేషన్ లా ఉపయోగించవచ్చు.

క్రోమ్ అనుసంధానం కొరకు : 

ఫైర్ ఫాక్స్ అనుసంధానం కొరకు : 

ఆండ్రాయిడ్ అప్లికేషన్ కొరకు : 

బ్రౌజరు లో అనుసంధానం సులభం గానే ఉంటుంది కానీ  మొబైల్ యాప్ లో కొన్ని సెట్టింగ్స్ చేస్కోవలసి ఉంటుంది . ఎందుకంటే మొబైల్ లో ఇతర యాప్ లలో కూడా passwords మేనేజ్ చెయ్యడానికి lastpass యాప్ కు accessibility అనే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది . ఒక్కసారి అన్ని సెట్ చేస్కుంటే ఇక మనం ప్రతిసారి passwords ఎంటర్ చేసే శ్రమ తగ్గిపోతుంది .

లాస్ట్ పాస్

అలాగే మొబైల్ లో ఈ అప్లికేషన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా పని చేస్తుంది . మీరు ఈ లాస్ట్ పాస్ సర్వీస్ ని యూజ్ చెయ్యడం ద్వారా హాకర్స్

అలానే ఫిషింగ్ ఎటాక్ ల భారిన పడకుండా ఉంటారు, అదీ కాకుండా మీ పక్కన ఉండే వాళ్ళు  చూడకుండా పాస్వర్డ్ ఎంటర్ చెయ్యగలుగుతారు .


షేర్ చెయ్యండి – కేర్ చెయ్యండి

 

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *