Apps Latest Tech Uncategorized

గూగుల్ తేజ్ విడుదలైంది | పూర్తి వివరాలు …

google-tez-app-india-launched

 

3 రోజుల క్రితం ప్రకటించినట్టుగానే ఈరోజు ‘తేజ్‘ యాప్ విడుదల ఐంది . గూగుల్ నెక్స్ట్ బిలియన్ యూజర్స్ VP సీజర్ సేన్ గుప్తా ఈ యాప్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసారు . ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐ OS లలో లభిస్తుంది . ఈ యాప్ ద్వారా చెల్లింపులు చెయ్యవచ్చు.

ఇక యాప్ ఫీచర్స్ విషయానికి వస్తే ఈ అప్ ద్వారా మనం పేమెంట్ సెండ్ చెయ్యవచ్చు అలానే రిసీవ్ చేస్కోవచ్చు . వాల్లెట్ లాంటి సదుపాయమేమి ఇందులో లేదు. డబ్బుని డైరెక్ట్ గా బాంక్ నుంచే సెండ్ చేస్తుంది అలానే రిసీవ్ చేస్కున్నపుడు బాంక్ ఖాతా లోకే జమ చేస్తుంది . ఇందులో ఉన్న ఇంకో సౌకర్యమేమిటంటే మనం మన వివరాలు(మొబైల్ నెంబర్ , పేరు , ఈమెయిలు ) ఎదుటివ్యక్తికి తెలపకుండానే పేమెంట్ పంపడం కానీ , స్వీకరించడం కాని చెయ్యవచ్చు. స్వీకరించాలి అనుకున్నపుడు రిసీవ్ బటన్ నొక్కితే అల్ట్రా సోనిక్ సౌండ్ విడుదల చేస్తుంది (స్పీకర్ దగ్గర చెవి ఉంచితే మనం కూడా వినొచ్చు ), అటువైపు పే చేసే వాళ్ళ తేజ్ అప్ ఆ ఫ్రీక్వెన్సీ ని తీస్కుని సురక్షితంగా డబ్బు చెల్లించబడుతుంది . ఈ విధానం ఇద్దరు వ్యక్తులు పక్కపక్కన ఉన్నపుడు మాత్రమే ఉపయోగపడ్తుంది .

తేజ్ లో నచ్చని అంశం ఏంటంటే మనకు డిఫాల్ట్ గా కేటాయించిన UPI అడ్రస్ మార్చుకునే అవకాశం లేదు . తరువాతి వెర్షన్ లలో ఈ సదుపాయం కల్పించవచ్చు. ఈ యాప్ తెలుగు,ఇంగ్లీష్,తమిళ్,కన్నడ,గుజరాతి మొదలగు భాషల్లో లభిస్తుంది.

తేజ్ విడుదల సందర్భంగా 3 ఆఫర్లు ప్రకటించింది .

తేజ్-లాంచ్-ఆఫర్స్

 

డౌన్ లోడ్ చెయ్యడానికి :  https://g.co/tez/jM07w


షేర్ చెయ్యండి – కేర్ చెయ్యండి

 

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *