Apps Latest Tech Uncategorized

గూగుల్ ప్రొటెక్ట్ ఆక్టివేట్ చెయ్యడం ఎలా ???

గూగుల్ ప్రొటెక్ట్, గూగుల్ యాప్ స్టోర్ లో వేలాది యాప్ లలో మాల్వేర్ ఉంది అని తెలిసాక గూగుల్ తయారు చేసిన కొత్త  ఫీచర్. ఇది మనం ఏదైనా యాప్ ఇంస్టాల్ చేసేటపుడే దాన్ని గూగుల్ యాంటీ వైరస్ డెఫినిషన్స్ తో స్కాన్ చేసి అది సురక్షితం అయితే ఇంస్టాల్ అయ్యేలా చేస్తుంది.  ఒకవేళ సురక్షితం కాకపోతే ఇంస్టాల్ చెయ్యనివ్వకుండా హెచ్చరిస్తుంది. ఇంస్టాల్ చేసేటపుడు మాత్రమే కాకుండా ఇంస్టాల్ అయ్యాక కూడా నిరంతరం స్కాన్ చేస్తూ సురక్షితంగా ఉంచడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ఈ ఆప్షన్ ఆక్టివేట్ చెయ్యడం చాలా సింపుల్. ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి ఆప్షన్స్ బటన్ క్లిక్ చేస్తే వచ్చే మెనూ లో ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్ ను ఎన్నుకోవాలి.  అందులో ఉండే రెండు ఆప్షన్స్ ని ఆన్ చెయ్యాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *