Cyber Security Uncategorized

డబుల్ లాకర్ – పూర్తి వివరాలు

Double Locker అనే ransome ware మొబైల్ లో ఒక సాధారణ యాప్ లాగా ఇంస్టాల్ అయ్యి ముందుగా గూగుల్ ప్లే సర్వీసెస్ యొక్క accessibility ఫీచర్ ను ఆక్టివేట్ చెయ్యమని సూచిస్తుంది.  అలా చేయగానే ఆ మాల్వేర్ హోమ్ లాంచర్ గా సెట్ చేసుకుంటుంది. ఇదంతా వినియోగించేవారికి తెలీకుండానే జరిగిపోతుంది.  ఎప్పుడైతే మనం హోమ్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు ఈ మాల్వేర్ తన పని ప్రారంభిస్తుంది.  అన్ని ఫైల్స్ ని AES ఎంక్రిప్షన్ విధానంలో ఎంక్రిప్టు చేసి లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ని కూడా ఎక్కడా నోట్ చేసుకోకుండా అలానే హ్యాకర్ కు కూడా తెలీకుండా మార్చేస్తుంది.  తర్వాత స్క్రీన్ పై లాక్ తీసేయడానికి ఫైల్స్ తిరిగి డీ క్రిప్టు చెయ్యడానికి బిట్ కాయిన్స్ రూపంలో దాదాపుగా 80 డాలర్లు 24 గంటల్లోగా చెల్లించమని స్క్రీన్ పై మెసేజ్ రూపంలో చూపిస్తుంది.

దీని తొలగించడానికి రూట్ చెయ్యని మొబైల్స్ కు ఏ ఆప్షన్ లేదు ఫ్యాక్టరీ రీసెట్ చెయ్యడం తప్ప.  కానీ రూట్ చేసిన వాళ్లకు usb debugging ఆప్షన్ ద్వారా లాక్ స్క్రీన్ పాసవర్డ్ ను మార్చుకోవచ్చు.

ఇలాంటివాటి తో జాగ్రత్తగా ఉండాలి అంటే unknown sources ద్వారా యాప్స్ ఇంస్టాల్ చేసే ఆప్షన్ తీసి వెయ్యాలి.  అలానే అధీకృత సోర్సెస్ నుంచి మాత్రమే యాప్స్ ఇంస్టాల్ చెయాలి.  పూర్తిగా నమ్మకముంటే తప్ప అడ్మినిస్ట్రేటర్ యాక్సిస్ ఇవ్వరాదు.  అలానే యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను విధిగా ఉపయోగించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *