క్రిప్టో కరెన్సీ లో ఒకటైన బిట్ కాయిన్ ప్రస్తుతం దూసుకెళ్తు ఉంది. ఈ రెండు నెలల్లో ఏకంగా 2000 డాలర్లు పెరిగి ప్రస్తుతం ఎప్పుడు అందుకోనంత విలువ కలిగి ఉంది. బిట్ కాయిన్ తరహాలోనే ఎన్నో క్రిప్టో కరెన్సీ లు వచ్చినప్పటికీ బిట్ కాయిన్ తన అధిక్యం నిలుపు కుంటూ వస్తోంది.
ప్రస్తుతం 5585 డాలర్ల తో అత్యధిక మారకపు విలువ కలిగి ఉంది. 0.0013 డాలర్ల తో మొదలైన బిట్ కాయిన్ ప్రస్థానం ఇప్పుడు ఏ ఇతర కరెన్సీలు అందుకోలేనంత వేగంగా మారకపు విలువను పెంచుకుంటూ పోతుంది. దీనిని ఏ ప్రభుత్వం నియంత్రించ లేదు కాబట్టి ప్రతీ దేశం తమ సొంత క్రిప్టో కరెన్సీ ని రూపొందించాలని అనుకుంటున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇండియా లక్ష్మీ పేరుతో బిట్ కరెన్సీ తీసుకు రానుందని సమాచారం.