Mobile Uncategorized

వొడాఫోన్ ఐడియా 4g మొబైల్

జియో పోటీని తట్టుకోడానికి టెలికాం కంపెనీలు కొత్త దారులు వెతుకుతున్నాయి.  అందులో భాగంగానే ఎయిర్టెల్ 1300 రూపాయల 4g ఫోన్ ని రూపొందించే పనిలో ఉండగా ఇప్పుడు అదే బాటలో వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పట్టాయి.

వొడాఫోనే కంపెనీ ఐడియా కంపెనీ లో విలీనమవబోతున్న ఈ నేపథ్యంలో రెండు కంపెనీలు 2500 ధరలో స్మార్ట్ 4g మొబైల్ ని తీస్కురానుంది అని ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఒక ఆర్టికల్ లో తెలిపింది. దీనిపై ఐడియా కానీ వొడాఫోనే కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. TRAI ప్రస్తుత గణాంకాల ప్రకారం 4g వేగం విషయంలో ఐడియా జియో కంటే ముందు ఉన్నదని తేలింది. దాంతో 4g మార్కెట్ రానున్న రోజులలో ఎంతో కీలకమైనది. దీనికోసం అన్ని మొబైల్ కంపెనీలు ఎదో రకంగా వినియోగదారులని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *