Mobile Uncategorized

ఆపిల్ కు iPhone8 కష్టాలు.

iPhone 8 విడుదల తర్వాత ఆపిల్ కంపెనీ బిలియన్ డాలర్ నుంచి ట్రిలియన్ డాలర్ల కంపెనీ గా అవతరిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ iPhone 8 ఆ అంచనాలను అందుకోలేక పోగా,ఇంకా కష్టాలను తీసుకు వస్తూ ఉంది.

వివరాల్లోకి వెళ్తే iPhone 8 అలాగే iPhone X ఒకేసారి విడుదల కాగా, iPhone X అందర్నీ ఆకట్టుకుంది, iPhone 8 నిరాశ పరిచింది. ప్రతీ సారి లాగే క్యూ లైన్ లలో జనాలని ఊహించిన ఆపిల్ కంపెనీకి కాలీ గా ఉండే బారికేడ్లు ఈసారి పలకరించాయి. దీనికి ముఖ్య కారణం iPhone X ఫీచర్లు అలానే iPhone 8 యొక్క ధర . ఐఫోన్ 8 ,ఐఫోన్ 7 కి ఉండే ఫీచర్లే ఉన్నప్పటికీ ధర మాత్రం ఎక్కువగా ఉండటం ఒక కారణం. ఐఫోన్ 8 ప్రకటించిన తరువాత ఆపిల్ కంపెనీ యొక్క విలువ 2.8 శాతం పడిపోయింది. చాలా మంది ఐఫోన్ 7 నే కొనడానికి ఇష్టపడుతున్నారు అని సమాచారం. ఐఫోన్ X ఇంకా అమ్మకాలు మొదలవ్వలేదు, అదీకాక ఐఫోన్ X ను ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా ఉత్పత్తి చెయ్యడం చాలా కష్టం అని కంపెనీ ఐఫోన్ X లాంచ్ అప్పుడు తెలిపింది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *