Cyber Security Latest Tech Uncategorized

10,000 $ దిశగా బిట్ కాయిన్

బిట్ కాయిన్ పరుగు ఇప్పట్లో ఆగేలా లేదు. రెండు రోజుల క్రితం 5,580 డాలర్లు గా ఉన్న బిట్ కాయిన్ ధర ఇప్పుడు ఏకంగా 400 డాలర్లు ఎగబాకి 6,057 డాలర్లు దగ్గర స్థిర పడింది. బిట్ కాయిన్ ఇంకా 10,000 డాలర్లు వరకు వెళ్తుందని అంచనా.

JP మోర్గాన్ సంస్థ బిట్ కాయిన్ 10,000 డాలర్ల వరకు పెరిగి తర్వాత కుప్ప కూలిపోవచ్చు అని అంచనా వేసింది. బిట్ కాయిన్ పై JP మోర్గాన్ సంస్థ మొదటినుంచి నిరాశా జనకమైన స్టేట్మెంటులు ఇస్తూ ఉంది. ఏది ఏమైనా బిట్ కాయిన్ ని నియంత్రించడం ఎవరి చేతిలోను లేదు కనుక బిట్ కాయిన్ లో మదుపు చేసేవాళ్ళు తమకు అంతగా అవసరం లేని డబ్బు ని మాత్రమే ఇన్వెస్ట్ చెయ్యడం మంచిది. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో ఎంత మంది కొంటున్నారు,ఎంత కొంటున్నారు అనే ఫార్ములా ఆధారంగా మారకం విలువ మారుతూ ఉంటుంది. ఏ ప్రభుత్వం చేతిలోను దీని నియంత్రణ లేదు కాబట్టి , పేట్టుబడి పెట్టేపుడు నియంత్రించ గల రిస్క్ చేయడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *