Apps Latest Tech Uncategorized

గూగుల్ అస్సిస్టెంట్ వాయిస్ కమాండ్ మార్పు

ఆండ్రాయిడ్ మొబైల్ లో గూగుల్ అస్సిస్టెంట్ ని వాయిస్ కమాండ్ ద్వారా రన్ చేయడానికి ఎప్పటినుంచో “OK GOOGLE” ని వాడుతున్నాము. కానీ గూగుల్ హోమ్ పరికరం లో మాత్రం “OK GOOGLE” మరియు “HEY GOOGLE” రెండు ఉపయోగిస్తున్నాము.

ఇప్పుడు మొబైల్ కు కూడా హే గూగుల్ కమాండ్ తీసుకు వచ్చింది గూగుల్. ఇప్పటికే చాలా మందికి ఈ కమాండ్ పని చేస్తూ ఉండగా , ఇంకా చాలా మందికి ఇది అందుబాటులోకి రావాల్సి ఉంది.

ఈ కమాండ్ మీకు అందుబాటులోకి వచ్చినపుడు మీకు వాయిస్ ని నమోదు చేయమని నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు హే గూగుల్ అని మీ వాయిస్ ని 3 సార్లు రికార్డ్ చేస్తే, అప్పట్నుంచి మీ వాయిస్ కమాండ్ ని పాటిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *