Mobile Uncategorized

#RedMiNote5 లీక్ అయిన వివరాలు.

షియోమి బ్రాండ్ లో నే కాకుండా ఇండియా మొత్తం లో అత్యధికంగా సేల్ అయిన మొబైల్ గా గుర్తింపు పొందిన రెడ్ మీ నోట్ 4 శ్రేణిలో విడుదల అవుతున్న తరువాతి మొబైల్ రెడ్ మీ నోట్ 5. దీనిపై వినియోగదారుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. 

ఈ మొబైల్ నవంబర్ 11 లోపు చైనా లో రెడ్ మీ 5 మొబైల్ తో పాటే లాంచ్ చెయ్యొచ్చు. చైనా లో TENNA అనే మొబైల్ సర్టిఫికేషన్ సంస్థ దీనిని కొద్దీ రోజుల క్రిందట సర్టిఫై చేసింది. అన్ని ఫీచర్లు మామూలుగానే ఉన్నప్పటికీ అందరూ ఆశిస్తున్నా డ్యూయల్ కెమెరా (బ్యాక్ సైడ్ లో) లేదు అని సమాచారం. MiA1  మొబైల్ షియోమి బ్రాండ్ లో మొట్ట మొదటి డ్యూయల్ కెమెరా మొబైల్ గా ఎంతో పాపులర్ అయింది. రెడ్ మీ నోట్ 5 లో డ్యూయల్ కెమెరా ఉంటుందనుకున్న వినియోగదారులకు ఈ విషయం ఎంతో నిరాశా జనకం. ఈ మొబైల్ 18:9 డిస్ ప్లే తో ఫ్రంట్ లో ఎలాంటి ఫిజికల్ బట్టన్ లేకుండా వస్తుంది. మిగతా అన్ని ఫీచర్లు నోట్ 4 లాగానే ఉన్నప్పటికీ ప్రాసెసర్ మాత్రం స్నాప్ డ్రాగన్ 630 లేదా 636 ని ఉపయోగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *