Latest Tech Uncategorized

17 లెన్స్ లతో సామ్ సంగ్ రౌండ్ 360 కెమెరా.

సామ్ సంగ్ 360 కెమెరా 17 లెన్స్ లతో వస్తుంది. ఈ కెమెరా 360 డిగ్రీ వర్చ్యువల్ రియాలిటీ వీడియో ని రికార్డ్ చేస్తుంది. 8 జతల కెమెరాలు రౌండ్ గా సమాంతరంగా ఉంటే ఒక్క కెమెరా మాత్రం పై వైపున ఉంది.

ఈ డివైస్ కు ఇతర 360 కెమెరాల లాగా ఫ్యాన్ అవసరం లేదు. అలానే ఈ డివైస్ లో అన్ని కెమెరాల నుంచి రికార్డ్ అయ్యే ఇన్ పుట్ ని ఒకే 360 డిగ్రీ ఫోటో/వీడియో గా మార్చడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ అవసరం లేకుండా డివైస్ లొనే సాఫ్ట్ వేర్ ని పొందు పరిచారు. ఈ పరికరం లో 10 GB RAM ,40 GB అంతర్గత మెమరీ ఉంది. 6 మైక్ లు ఉన్నాయి,2 మైక్ లు external గా కనెక్ట్ చేస్కోవచ్చు. LAN మరియు USB-C పోర్ట్ ద్వారా దీనిని కనెక్ట్ చేస్కోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *