Latest Tech Uncategorized

పెరిగిన సెక్యూర్డ్ వెబ్ సైట్ లు – గూగుల్ రిపోర్టు

హ్యాక్కర్లు విజృంభిస్తున్న పరిస్థితులలో సెక్యూర్ ఎంక్రిప్షన్ లేని వెబ్ సైట్ లు అన్నిటిని URL టాబ్ దగ్గర “Not secure” అని గూగుల్ క్రోమ్ సహా ఇతర బ్రౌజర్ లు అన్ని చూపిస్తున్నాయి. వెబ్ సైట్ సర్వర్ నుంచి యూజర్ బ్రౌజర్ కు వచ్చే ట్రాఫిక్ మొత్తం SSL (సెక్యూర్డ్ సాకెట్ లేయర్) ద్వారా వెళుతూ ఉంటే ఆ వెబ్ సైట్ సెక్యూర్డ్ అని అర్థం.

సెక్యూర్డ్ వెబ్ సైట్ ని మనం సులభంగా గుర్తించొచ్చు. URL బార్ లో వెబ్ సైట్ అడ్రెస్ https తో మొదలైతే ఆ సైట్ సెక్యూర్డ్ అని,http తో మొదలైతే సెక్యూర్ కాదు అని. http తో మొదలయ్యే వెబ్ సైట్ ట్రాఫిక్ బ్రౌజరు నుంచి సర్వర్ వరకు ఎంక్రిప్టు అవ్వకుండా సాధారణ టెక్స్ట్ మాదిరిగానే వెళుతుంది. ఆదే https వెబ్ సైట్ లలో మాత్రం బ్రౌజర్ నించి సర్వర్ కు వెళ్లే ట్రాఫిక్ ఎంక్రిప్టు అయ్యి వెళుతుంది. సెక్యూర్డ్ గా ఉండే వెబ్ సైట్ లు పోయిన సంవత్సరం 50% ఉండగా ఇప్పుడు 89 % కు పెరిగాయి అని ఒక రిపోర్ట్ లో గూగుల్ తెలిపింది. గూగుల్ కూడ సెర్చ్ ఇంజన్ ర్యాంకింగ్ లలో సెక్యూర్డ్ వెబ్ సైట్ లకి ప్రాధాన్యత ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *