Latest Tech Uncategorized

ఫింగర్ ప్రింట్, AI తో షియోమి స్మార్ట్ డోర్.

షియోమి మొబైల్స్  మాత్రమే కాకుండా హోమ్ టెక్నాలజీ కు సంబంధించిన స్మార్ట్ పరికరాలను కూడా తయారు చేస్తుంది అన్నది తెలిసిన విషయమే. ఇప్పుడు షియోమి స్మార్ట్ హోమ్ పరికరాల జాబితా లోకి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఫింగర్ ప్రింట్ ద్వారా లాక్ ఓపెన్ చేసే విధంగా తయారు చేసిన స్మార్ట్ డోర్ కూడా చేరింది.

ఈ స్మార్ట్ డోర్ ని నాలుగు విధాలుగా ఓపెన్ చెయ్యవచ్చు.

  • పాస్ కోడ్
  • ఫిజికల్ కీ
  • స్మార్ట్ ఫోన్ యాప్
  • ఫింగర్ ప్రింట్

షియోమి ఈ స్మార్ట్ డోర్ లాక్ కనీసం 10 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటుందని ,అలాగే చాలా ఎక్కువ ఒత్తిడి ని ,వేడిని తట్టుకుంటుంది అని తెలిపారు. ఫింగర్ ప్రింట్ రికాగ్నిషన్ కూడా 5000 సార్లు ప్రయత్నిస్తే 1 అంత కంటే తక్కువ సార్లు ఫెయిల్ అవుతుందని తెలిపింది. ఈ స్మార్ట్ డోర్ లాక్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వలన తరచుగా ఉపయోగించే వ్యక్తుల్ని గుర్తిస్తుంది అని తెలిపారు. దీనికి సెట్ చేసిన అలారమ్ 15 సార్ల కంటే ఎక్కువ సార్లు తెలియని వ్యక్తులు లాక్ ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నిస్తే మ్రోగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *