Mobile Uncategorized

తక్కువ ధర లో iPhone X.

ఐఫోన్ X ప్రస్తుతం ఆపిల్ బ్రాండ్ లో ఎక్కువ గా ఎదురు చూస్తున్న ఫోన్. దీని ధర 90,000 పైగా ఉండొచ్చని అంచనా. ఆపిల్ లో మొట్ట మొదటి బెజల్ లెస్ ఫోన్ ఐఫోన్ X. ముందు వైపు ఎలాంటి ఫిజికల్ కీ లేకుండా , ఫింగర్ ప్రింట్ పద్దతి తీసేసి ఫేస్ ID పద్దతిలో ఫోన్ లాక్ తీసే విధంగా ఐఫోన్ X తయారు చేశారు.

ఇదే మొబైల్ ని తక్కువ ధరలో దొరికేలా ఇంకో వేరియెంట్ ను తయారు చేయాలని అనుకుంటింది ఆపిల్. 2018 లో దీన్ని లాంచ్ చెయ్యాలని అనుకుంటుంది. హై ఎండ్ వేరియెంట్ కు “లిస్బన్” అని, లో ఎండ్ వేరియెంట్ కి “హ్యాంగ్ జౌ” అని పేరు పెట్టారు. రెండిటిలోను టెక్నాలజీ పరంగా ఎలాంటి మార్పులు లేనప్పటికీ మెమరీ విషయంలో రెండిటిలోను తేడాలు ఉండవచ్చని సమాచారం. ఇంకా ధర ఎంత ఉండవచ్చొ అనే సమాచారం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *