Mobile Shopping Deals Uncategorized

999 కే భారత్ 2 అల్ట్రా 4G మొబైల్

జియో 1,500 రూపాయల జియో ఫోన్ ప్రస్తుతం టెల్కో ల భాగస్వామ్యంతో అతి తక్కువ ధరలో దొరుకుతున్న 4G మొబైల్. దీన్ని బ్రేక్ చేస్తూ వొడాఫోన్ – మైక్రోమాక్స్ భాగస్వామ్యంతో 999 రూపాయలకే 4G మొబైల్ తీస్కురాబోతుంది.

భారత్ 2 అల్ట్రా మొబైల్ 2,899 రూపాయలకు అందుబాటులో ఉంది. వొడాఫోన్ భాగస్వామ్యంతో దీన్ని తీసుకుంటే 36 నెలలలో 1900 రూపాయలు తిరిగి ఇవ్వబడతాయి. అప్పుడు మొబైల్ ధర 999 రూపాయలకే వస్తుంది. ఈ 1900 తిరిగి ఇవ్వాలంటే వినియోగదారుడు ఖచ్చితంగా నెలకు కనీసం 150 చొప్పున 36 నెలలు చెల్లించాలి. 1900 రూపాయలు రెండు విడతలుగా వొడాఫోన్ m-pesa వాల్లెట్ లో జమ అవుతాయి. మొదటి 18 నెలల తర్వాత 900 రూపాయలు,అలానే చివరి 18 నెలల తర్వాత 1000 రూపాయలు వాల్లెట్ లో జమ అవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *