Apps Latest Tech Uncategorized

ఫేస్ బుక్ తప్పిదం – వ్యక్తి అరెస్ట్

ఫేస్ బుక్ చేసిన తప్పిదానికి ఒక పాలస్తీనా వ్యక్తి మూల్యం చెల్లించాడు. ఫేస్ బుక్ లోని ఒక ట్రాన్స్ లేషన్ లోపం కారణం గా అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కొద్ధి గంటల్లోనే విషయం అర్థమై అతన్ని విడుదల చేసారు. ఫేస్ బుక్ అతన్ని క్షమాపణ కోరింది.

వివరాల్లోకి వెళ్తే పాలస్తీనా లో ఒక Construction వర్కర్ బుల్ డోజర్ పక్కన నుంచుని తమ భాషలో yusbihuhum అని పోస్ట్ చేసాడు  yusbihuhum అంటే గుడ్ మార్నింగ్ అని. కానీ ఫేస్ బుక్ ట్రాన్స్ లేటర్ దాన్ని Attack them మార్చింది. దాంతో పోలీసులు బుల్ డోజర్ తో ఎటాక్ ప్లాన్ చేయబోతున్నాడని అరెస్ట్ చేశారు. 

దీంతో స్పందించిన ఫేస్ బుక్ భాషా తర్జుమా విభాగం ఇంజినీర్ నేసిప్ ఫాసిల్ అయాన్ ఆ తప్పు తమ సిస్టం లోని లోపం వల్లే జరిగిందని , దానికి బాధిత కుటుంబానికి క్షమాపణలు కోరుకుంటున్నట్టు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *