Uncategorized

ఆదార్ – సిమ్ కార్డు లింకింగ్ (3 సులభ మార్గాలు )

ఆధార్ నెంబర్ ని సిమ్ కార్డు నెంబర్ తో జత చేయడానికి టెలికాం శాఖా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది . టెలి కమ్యూనికేషన్స్ శాఖా మంత్రి మనోజ్ సింహ వినియోగదారుల సహాయార్థం వీటిని ప్రవేశ పెట్టారు . ఇప్పటివరకు టెలికాం స్టోర్ ల దగ్గరకు వెళ్ళడం తప్పితే ఇంకో అవకాసం లేదు .

నూతనం గా ప్రవేశ పెట్టిన విధానాల వలన వినియోగదారులు 3 రకాలుగా ఆదార్ – సిమ్ కార్డు లింక్ చేసుకోవచు .

  • డోర్ స్టెప్ వెరిఫికేషన్
  • OTP వెరిఫికేషన్ (SMS / IVRS )
  • ఆన్ లైన్ వెరిఫికేషన్

డోర్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మీరు ఉపయోగిస్తున్న సిమ్ కార్డు ప్రొవైడర్ మీకు ఈ సర్వీస్ లని అందజేయ్యలని టెలికాం శాఖా , సిమ్ నెట్ వర్క్ కంపెనీ లని ఆదేశించింది.

OTP వెరిఫికేషన్ పద్దతి ద్వారా వినియోగదారులకు SMS లేదా , IVRS పద్దతిలో ఆధర్ నెంబర్ ను లింక్ చేసుకునేల సదుపాయం కల్పించమని ఆదేశించారు .

ఆన్ లైన్ వెరిఫికేషన్ పద్దతిలో వెబ్ సైట్ ని సిద్దం చేసి దాని ద్వారా వెరిఫికేషన్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది .

త్వరలో ఈ మూడు పద్దతులు అందుబాటులోకి తేవాలని , వీటి గురించి SMS ల ద్వారా ప్రజలకి అవగాహన కల్పించి నిర్ణీత సమయం లో ఆదార్ లింక్ చెయ్యడం కు తోడ్పడాలని టెలికాం శాఖ ,టెలికాం ప్రొవైడర్ లని ఆదేశించింది .

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *