Uncategorized

అమెజాన్ కీ – అమెజాన్ కొత్త సర్వీస్

అమెజాన్ లో ఏమైనా లభిస్తాయి . ఏవి కావాలన్నా సింపుల్ గ ఆర్డర్ పెట్టేయ్యోచ్చు . ఆర్డర్ పెట్టిన మరుసటి రోజే డెలివరీ చేసే అంత వేగం గ  ప్రస్తుతం అమెజాన్ సర్వీస్ లు అందిస్తుంది . ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకి amazon key అనే కొత్త ఫీచర్/ సర్వీస్ నవంబర్ 8 నుంచి 38 దేశాలలో అందుబాటులోకి తీస్కువస్తుంది .

ఈ సర్వీస్ పొందాలంటే ప్రైమ్ వినియోగదారుడి ఉండాలి . అమెజాన్ కీ ఇన్ హోం కిట్ ను దాదాపుగా 249.99 డాలర్లు చెల్లించి కొనుగోలు చెయ్యాలి . ఆ కిట్ లో ఇచ్చిన manual ఆధారంగా కిట్ ను ఇంటిలో ఫిట్ చెయ్యాలి . వినియోగదారులకు కుదరకపోతే అమెజాన్ వల్లే ఉచితంగా ఫిట్ చేస్తారు . ఈ కిట్ లో ఒక స్మార్ట్ లాక్ , క్లౌడ్ కెమెరా పొందు పరిచి ఉంటాయి . అమెజాన్ లో ఆర్డర్ పెట్టేపుడు ఇన్ హోం డెలివరీ ఆప్షన్ తీసుకుంటే అమెజాన్ డెలివరీ పర్సన్ కీ తెరుచుకుని ఇంట్లో ఆర్డర్ ఐటమ్ ని ఉంచి మల్లి లాక్ చేసి వెళ్ళిపోతాడు . ఇదంతా క్లౌడ్ కెమెరా లో రికార్డు అవుతుంది . మనం లైవ్ లో చూడొచ్చు . కుదరకపోతే తరువాత ఆ వీడియో ని చూడొచ్చు . ఈ కిట్ అమెజాన్ పర్పస్ కే కాక వినియోగదారులు తమకు తెల్సిన ఎవరినైనా లోపలి పంపించడానికి కూడా ఉపయోగ పడుతుంది . దీనికోసం అమెజాన్ కీ అనే యాప్ ని ప్రత్యేకంగా రూపొందించారు . దీంతో మనం కీ ని ఇంటిదగ్గరే తెలీకుండా దాచే అవసరం ఉండదు . ఎప్పటికప్పుడు ఇంట్లో జరిగేవన్నీ చూడొచ్చు . ఎవరినైనా నిర్ణీత సమయం వరకే ఉంచాలి అనుకుంటే టైం కూడా సెట్ చేసి access ఇవ్వొచ్చు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *