Mobile Uncategorized

కొత్త సిరీస్ ఆవిష్కరించనున్న షియోమి

MiA1 మరియు Mi mix 2 లాంచ్ చేసిన షియోమి మరో కొత్త మొబైల్ , కొత్త సిరీస్ లో లాంచ్ చెయ్యడానికి సిద్ధం అవుతుంది. ప్రస్తుతం షియోమి బ్రాండ్ లో నోట్ సిరీస్, రెడ్ మీ సిరీస్ , mi మిక్స్ సిరీస్ ,Mi మాక్స్ సిరీస్ , Mi సిరీస్ మొబైల్ ఫోన్ లు ఇప్పటిదాకా రిలీస్ అయ్యాయి.

ఇప్పుడు కొత్తగా ఇంకో సిరీస్ మొబైల్ నవంబర్ రెండవ తేదీన లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. విడుదల చేసిన టీజర్ ను గమనిస్తే బూస్ట్ ఛార్జ్ ఐకాన్ మనకు కనిపిస్తుంది. కాబట్టి , వచ్చే సిరీస్ మొబైల్ ఫాస్ట్ ఛార్జ్ తో వస్తుండ వచ్చు. ఇప్పటి వరకు షియోమి సిరీస్ లో ఒక్క మొబైల్ కూడా ఫాస్ట్ ఛార్జ్ ఆప్షన్ లేవు. ఈ సిరీస్ లో ఫాస్ట్ ఛార్జ్ మొబైల్ తీసుకు రాబోతున్నారు.  ఇంకా మిగిలిన కాన్ఫిగరేషన్ వివరాల గురించి ఏ సమాచారం లేదు. Redmi note 4 మొబైల్ ప్రస్తుతం అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ఈ మార్కెట్ లలో నెంబర్ వన్ మొబైల్ గా హల్ చల్ చేస్తూ ఉంది. ఈ కొత్త సిరీస్ మొబైల్ ఫీచర్లు కనుక redmi note 4 లాగానే ఉంటే కచ్చితంగా ఈ మొబైల్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేయగలదు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *