Apps Uncategorized

వాట్సాప్ రీ కాల్ ఫీచర్

వాట్సాప్ లో ఎప్పటినించో వస్తుంది అనుకుంటున్న మెసేజ్ డిలీట్ చేసే ఫీచర్ ఆండ్రాయిడ్, ఆపిల్ , విండోస్ యూజర్ల కి అందుబాటులోకి వచ్చింది. డిలీట్ ఫర్ ఎవెరీ వన్ అనే ఆప్షన్ తో ఇది అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్ తమ FAQ పేజీ లో ఈ ఫీచర్ అన్ని దేశాల వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది అని తెలియ చేసింది.

ఈ ఫీచర్ సింగపూర్ , స్పెయిన్ వాళ్ళకి ఈపాటికే వచ్చేయగా ఇండియన్ యూజర్లకి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ పంపిన 7 నిమిషాలలోపే పని చేస్తుంది. 7 నిమిషాల తర్వాత డిలీట్ చెయ్యడం ఎట్టి పరిస్థితి లోను కుదరదు. డిలీట్ అయిన మెసేజ్ స్థానంలో “This message was deleted” అని చూపిస్తుంది. ఈ మెసేజ్ సెండర్ అలానే రిసీవర్ ఇద్దరికి చూపిస్తుంది. మెసేజ్ డిలీట్ చెయ్యాలంటే ఆ మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చెయ్యాలి, ఇంకా వేరేవి కూడా డిలీట్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని పైన కనిపించే డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి. 7 నిమిషాల లోపు పంపించినవి మాత్రమే డిలీట్ అవుతాయి.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *