Latest Tech Uncategorized

ఆండ్రాయిడ్ 8.1 లో ఫాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్

ఏ మొబైల్ ని అయినా సెక్యురిటి లాక్ బైపాస్ చెయ్యడానికి ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ఉపయోగిస్తూ ఉంటాం. ఈ లూప్ హోల్ వలన మొబైల్ చోరీ కి గురయితే ఇక అంతే సంగతులు. దీని నివారించడానికి గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ 5.1 లొనే గూగుల్ అకౌంట్ ద్వారా దాన్ని ప్రొటెక్ట్ చేసింది.

ఇది ఎలా పని చేస్తోంది అంటే ఒక వేళ చోరీ చేసిన వ్యక్తి ఫ్యాక్టరీ రీసెట్ చేసినా సరే తరువాత వినియోగదారుడి gmail లాగిన్ అడుగుతుంది. దీంతో ఎలా రీసెట్ చేసిన సరే అధీకృత వినియోగదారుడు gmail అకౌంట్ పాసవర్డ్ లేకుండా డివైస్ ను ఉపయోగించడం కుదరదు. దీన్నే ఒక బటన్ గా ఆండ్రాయిడ్ 8.1 వెర్షన్ లో గూగుల్ తీసుకు రాబోతోంది. ఈ ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ పై అవగాహన కల్పించడానికి స్టేటస్ బార్ దగ్గరే ప్రస్తుతం ప్రొటెక్ట్ అయ్యిందా లేదా లేదా అన్నది చూపిస్తుంది. ఈ ఆప్షన్ 2nd హాండ్ వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రొటెక్షన్ ఉందా లేదా అన్నది బూట్ అయిన వెంటనే తెలిసిపోతుంది. ప్రొటెక్షన్ ఉంటే చోరీ చేసి అమ్మట్లేదని , ప్రొటెక్ట్ లేకపోతే చోరీ చేసి అమ్మేస్తున్నట్లు అర్థం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *