Latest Tech Uncategorized

పౌరసత్వం పొందిన మొదటి రోబో సోఫియా

ప్రపంచం లో పౌరసత్వం పొందిన మొదటి రోబో గా సోఫియా నిలిచింది.ఈ రోబోట్ ని హాంగ్ కాంగ్ కు చెందిన హ్యాన్సన్ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసింది. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ రోబోట్ కి పౌరసత్వం ఇచ్చింది.

దీనిపై స్పందిస్తూ సోఫియా సౌదీ అరేబియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. విలేకరుల సమావేశంలో ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా “తను మానవాళి జీవితాల్ని సులభం చెయ్యడానికి కృషి చేస్తున్నట్లు ” తెలిపింది. దీనికి విలేకరి రోబోట్ ల ద్వారా చెడే ఎక్కువగా జరగ వచ్చు అణా ప్రశ్న కి సమాధానంగా  మీరు ఎలాన్ మస్క్ ని ఎక్కువగా చదువుతున్నారు, అలానే హాలీవుడ్ సినిమా లు ఎక్కువ గా చూస్తున్నారంటూ వ్యంగంగా సమాధానం ఇచ్చింది.

దీనికి సమాధానంగా ఎలాన్ మస్క్ ఆ రోబోట్ కి గాడ్ ఫాథర్ సినిమా లని ఇన్ ఫుట్ గా ఇవ్వండి. ఇంకెంత దారుణం అది చేస్తుందో చూడండి అని ట్వీట్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *