Apps Latest Tech Uncategorized

పూర్తిగా డిజిటల్ అవ్వనున్న ఫార్మసీలు

ఇకనుంచి పేపర్ పై రాసే మెడిసిన్ ఇక చెల్లదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం CDMS అనే కొత్త పద్దతిని AP అంతటా తీసుకు రానుంది. దీని ద్వారా ఫేక్ డాక్టర్లను నియంత్రించడం జరుగుతుంది. CDMS అంటే Comprehensive Drug Monitaring System.

ఆంధ్ర లో ఉన్న 64,000 మంది రిజిస్టర్డ్ డాక్టర్లు, రిజిస్టర్ అయిన కెమిస్ట్ లను అనుసంధానించి ఈ CDMS ను రూపొందించారు. ఈ సిస్టమ్ ద్వారా రోగిని పరీక్షించి CDMS యాప్ లో మెడిసిన్ పేరు, బ్రాండ్ ఛాయిస్ లు నమోదు చెస్తాడు. దాన్ని digital signature ద్వారా పేషెంట్ మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ తో లింక్ చేస్తారు. రోగి రిజిస్టర్ అయిన ఏ కెమిస్ట్ దగ్గర అయిన ఆధార్ వెరైఫికేషన్ కానీ , మొబైల్ OTP వెరిఫికేషన్ కానీ చేసి ఆ మందులు తీసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఫేక్ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కు మందులు ఇవ్వబడవు. అలాగే ప్రతీ ఒక్కరు హెల్త్ వివరాలు పొందుపరచడం కూడా జరిగిపోతుంది. ఇలాంటిది ఇండియాలో AP లొనే ముందు గా ప్రవేశ పెట్టారు. ప్రిస్క్రిప్షన్ అవసరం లేని కొన్ని మందులను ప్రభుత్వం ఈ ప్రోసెస లేకుండానే ఇవ్వడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *