Mobile Uncategorized

నోకియా 2 విడుదల అయింది

నోకియా 2 మొబైల్ లాంచ్ అయింది. ఇంతకు ముందు అనుకున్నట్టుగానే ఈ మొబైల్ 99 డాలర్ల ధరలో విడుదలైంది . మనదేశం మారకంలో 6000 నుంచి 8000 వరకు దీని ధర ఉండవచ్చు

8GB ఇంటర్నల్ మెమరీ తో , 1 GB RAM తో లభిస్తుంది.వెనుక వైపున 8 మెగా పిక్సెల్ , ముందు వైపున 5 మెగా పిక్సెల్ సామర్థ్యం తో కెమెరా లభిస్తుంది. 5 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో ఈ మొబైల్ విడుదల అయింది.దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దీని 4,100 mAh బ్యాటరీ. కంపెనీ కూడా బ్యాట్టరీ 2 రోజులు వస్తుంది అని ప్రకటించింది. నౌగట్ వెర్షన్ ద్వారా పని చేస్తోంది. ఓరియో అప్ డేట్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని కంపెనీ తెలిపింది. గూగుల్ అసిస్టెంట్ సహితంగా ఈ మొబైల్ వస్తుంది అని కంపెనీ విడుదల చేసిన వీడియో లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *