Mobile Uncategorized

సామ్ సంగ్ ను దాటేసిన వన్ ప్లస్

వన్ ప్లస్ రీసెంట్ గా 100 % కస్టమర్ సంతృప్తి కలిగిన సంస్థ గా వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మకాల విషయంలో కూడా సామ్ సంగ్ ను వెనక్కు నెట్టి 2 వ స్థానానికి చేరింది.

కౌంటర్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ లో 30,000 పై ధర ఉండే మొబైల్ అమ్మకాలలో సామ్ సంగ్ ఇప్పటి వరకు 2 వ స్థానంలో అన్నింది. తాజాగా 35 % అమ్మకాలతో ఆపిల్ మొదటి స్థానంలో ఉండగా , 32 % తో వన్ ప్లస్ 2 వ స్థానంలో ఉంది, 3 వ స్థానంలో సామ్ సంగ్ 30 % తో ఉంది. సామ్ సంగ్ అమ్మకాల విషయంలో ఈ మధ్య వెనక పడడం తెలిసిందే. మొత్తం మొబైల్ (లో,మిడ్,హై రేంజ్) అమ్మకాలలో కూడా సామ్ సంగ్ కేవలం 0.5 % తేడాలో షియోమి తో పోటీ పడుతూ ఉంది. సామ్ సంగ్ తమ ధర/ వ్యూహం మార్చక పోతే త్వరలో సామ్ సంగ్ తన స్థానాన్ని పూర్తిగా దిగజార్చినా ఆశ్చర్యం లేదు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *