Latest Tech Uncategorized

7,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్

వారం క్రితం 6,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్ (Bit Coin) ఇప్పుడు 7,000 మార్కును దాటి 7,100 డాలర్ల దగ్గర స్థిర పడింది. చాలా వేగంగా ఎదుగుతున్న బిట్ కాయిన్ 10,000 డాలర్ల వరకు పెరిగి అక్కడ్నుంచి చాలా వేగంగా తరుగుతుంది అని JP మోర్గాన్ సంస్థ అంచనా వేసింది.

భారత ప్రభుతం వీటిని నియంత్రించాలని భావిస్తుంది అని సమాచారం. భారత్ కేంద్రంగా బిట్ కాయిన్ ఎక్స్చేంజి నిర్వహిస్తున్న సంస్థలని మూసేయించడానికి భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఒక చట్టం తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. బిట్ కాయిన్ ని నియంత్రించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని పక్షంలో కనీసం బిట్ కాయిన్ ఎక్స్చేంజి ల పై అయిన నియంత్రణ చేస్తే దీనిని అదుపు చేయొచ్చు అని , త్వరలో భారత్ లో ప్రత్యేకంగా లక్ష్మీ పేరుతో క్రిప్టో కరెన్సీ ని తీసుకువస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *