Latest Tech Mobile Uncategorized

6 ఇంచ్ FHD స్క్రీన్ తో ఓపో R11s

సెల్ఫీ ల కోసమే ప్రత్యేకంగా తయారు చేసినట్లుండే ఓపో (OPPO ) లో కొత్త మోడల్ విడుదల అయింది. ఒపో R11S మోడల్ పైన మొబైల్ మార్కెట్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. కొద్దీ రోజుల క్రితం జరిగిన లాంచ్ ఈవెంట్ లో దీన్ని రిలీజ్ చేశారు.

ఓపో లో ఉపయోగిస్తున్న కలర్ OS 3.2 అప్ డేట్ చేయబడి ఉంది. దీంట్లో స్ప్లిట్ స్క్రీన్ సౌకర్యాన్ని జత చేశారు. ఫేస్ ద్వారా లాక్ తీసే ఆప్షన్ ని కూడా ఇందులో జత చేశారు. ఫేస్ లాక్ కోసం AI (కృత్రిమ సాంకేతికత) ఉపయోగించినట్లు తెలిపారు.

ఓపో 4 GB RAM అలాగే 64 GB అంతర్గత మెమరీ సహితం గా లభిస్తుంది. గేమింగ్ కొరకు 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ తో స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో ఈ మొబైల్ తయారు చేయబడింది. 20 MP సెల్ఫీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహయంతో బ్యూటిఫికేషన్ కోసం ఉపయోగించినట్లు తెలిపారు. రేర్ కెమెరా గా 16 MP + 20 MP డ్యూయల్ కెమెరా ఉంది. రెండు కెమెరా లు f1.7 అపెర్చుర్ కలిగి ఉన్నాయి. వీటి ధర గురించి ఇంకా ఏ సమాచారం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *