Uncategorized

3 GB వేరియంట్ తో నోకియా 5.

ఒక నెల కిందటే నోకియా 5 2 GB వెర్షన్ విడుదల చేయగా , తాజాగా నోకియా 5 లోనే ఇప్పుడు 3 gb వెర్షన్ ను విడుదల చేసారు . ఇది ముందుగ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఆన్ లైన్ లో ముందుగ అమ్మకం జరుగుతుంది . ఆఫ్ లైన్ స్టోర్ లకంటే ముందుగ ఫ్లిప్ కార్ట్ వెబ్సైటు లో దొరుకుతుంది .

దీని ధర 13,499 రూపాయలుగా HMD గ్లోబల్ సంస్థ ప్రకటించింది . 2 GB వెర్షన్ ధర 12,499 రూపాయలు . ఫ్లిప్ కార్ట్ ద్వారా నవంబర్ 7 నుంచి అందుబాటులో ఉంటుంది . జియో , నోకియా ప్రత్యేక ఆఫర్ ద్వారా ప్రతీ 309 మరియు అంతకుమించి రీఛార్జి లపై 5 gb డేటా ఉచితంగా లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ సైట్ లో లిస్టు చేయబడి ఉంది . నవంబర్ 14 నుంచి సెలెక్ట్ చేయబడిన రిటైల్ అవుట్ లెట్స్ ద్వారా ఆఫ్ లైన్ లో కూడా ఈ మొబైల్ లభిస్తుంది .

నోకియా 5 మొబైల్ 7.1.1 ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారితంగా పని చేస్తుంది . ఈ డ్యూయల్ సిమ్ మొబైల్ కు ఓరియో అప్ డేట్ కచితంగా విడుదల చేస్తామని నోకియా సంస్థ తెలిపింది . దీని ఫీచర్ల విషయానికి వస్తే 5.2 ఇంచ్ HD స్క్రీన్ తో , గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో లభిస్తుంది .ఆక్ట కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది . 13 మెగా పిక్సెల్ రేర్ కెమేరాతో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో ఈ మొబైల్ లభిస్తుంది . దీని బ్యాటరీ 3000 mAh కెపాసిటీ కలిగి ఉంది .

Buy Here : Click Here 

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *