Apps Latest Tech Uncategorized

పేటీయం భీమ్ UPI సౌలభ్యంతో

పేమెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న paytm ఇప్పుడు UPI అనుసంధానం తో మరింత యూజర్ ఫ్రెండ్లీ పేమెంట్ సిస్టమ్ ను తీసుకు వచ్చింది. UPI ద్వారా వినియోగదారులు అమౌంట్ సెండ్ చెయ్యడం , రిసీవ్ చేసుకోడం,వేరే సైట్ లలో paytm UPI ద్వారా పే చెయ్యొచ్ఛు.

మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ కు @paytm జత చేసి UPI అడ్రస్ ను కేటాయిస్తారు. మనకు కావలసిన అడ్రెస్ ను ఎంచుకునే సౌలభ్యం ప్రస్తుతం లేదు. UPI రంగంలోకి paytm చాలా లేట్ గా ఎంటర్ అయింది, కానీ paytm కు ఉన్న 22 కోట్ల యూజర్ బేస్ వలన ఆలస్యంగా వచ్చినా కూడా తమ వ్యాపారానికి ఎటువంటి పోటీ ఉండదు.ఇప్పటికే ఈ రంగం లో ఉన్న phonepe,tez అలాగే త్వరలో రానున్న అమెజాన్ పే, వాట్సాప్ UPI పేమెంట్స్ కు గట్టి పోటీ ఇవ్వనుంది. వాట్సాప్ కు పోటీగా paytm చాట్ ఆప్షన్ కూడా యాప్ లో తీసుకు వచ్చింది. ఈ యాప్ ద్వారా మెసేజ్ లు పంపించుకోడమే కాకుండా అమౌంట్ కూడా పంపించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *