Cyber Security Uncategorized

ట్విట్టర్ లోని బగ్ కారణంగా 35,000 క్యారెక్టర్ లతో ట్వీట్ 

ట్విట్టర్ ఒక నెల క్రితం 280 క్యారెక్టర్లతో ట్వీట్ చేసే ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది . ఇది సరిపోదన్నట్టు ఇద్దరు జర్మన్ వినియోగదారులు 35000 క్యారెక్టర్లతో ట్వీట్ చేశారు. ట్విట్టర్లోని ఒక బగ్ కారణంగా ఇది సాధ్యమయింది.

ఈ ట్వీట్ ని అర్థంపర్థంలేని అక్షరాలతో నింపేశారు. ఆ ఇద్దరు వినియోగదారులని @Timrasett అలాగే @HackneyYT ఖాతా లని ట్విట్టర్ బ్యాన్ చేసేసింది. మళ్లీ వాళ్లిద్దరూ అపాలజీ చెప్పిన కారణంగా వాళ్ల బ్యాన్ ని ఎత్తి వేశారు. అలాగే ఈ బగ్ ను ఫిక్స్ చేసినట్టు ట్విట్టర్ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *