Mobile Uncategorized

#iPhoneX డిజైన్ తో #MiMix2s

తాజా గా బెజల్ లెస్ ఫోన్ తో అందర్నీ ఆశ్చర్య పరిచిన#MiMix2 ఇప్పుడు , #MiMix2s తో వస్తున్నట్లు లీక్ అయిన ఫోటో ద్వారా తెలుస్తుంది. ఈ #MiMix2s అచ్ఛం ఐఫోన్ X లాగే టాప్ లో notch ని ఉంచారు. ఈ notch #MiMix2 లో లేకపోవడం గమనార్హం.

ఈ notch స్పష్టం గా ఆపిల్ ఐఫోన్ X రిలీజ్ అయిన తరువాత తీసుకు వచ్చారు అని తెలుస్తోంది. దీని వలన కొన్ని యాప్స్ సపోర్ట్ అవ్వక పోవచ్చు. ఈ notch వలన యాప్ డెవలపర్ లు ఈ మోడల్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చెయ్యాల్సి ఉంటుంది.ఇది ఎంతైనా కష్టమైన పనే. దీనిని షియోమి ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

చాలా మొబైల్స్ డిజైన్ పరంగా ఆపిల్ ను కాపీ చెయ్యడం తెలిసిందే,కానీ ప్రస్తుతం టాప్ రేస్ లో ఉన్న షియోమి ఈ విధంగా చెయ్యడం అస్సలు నచ్చని విషయం. ఇప్పటివరకు డిజైన్ పరంగా అధికారికంగా ఎటువంటి సమాచారం తెలియజేయనప్పటికి, లీక్ అయిన ఫోటోలు మాత్రం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *