Uncategorized

వైర్ లెస్ ఛార్జ్ లేకుండా #OnePlus5T

ఇంకా అధికారిక లాంచ్ ఈవెంట్ కి కేవలం ఒక్క వారం మాత్రమే ఉండగా వన్ ప్లస్ CEO వన్ ప్లస్ ఫోరం లో వన్ ప్లస్ 5T మోడల్ కు వైర్ లెస్ ఛార్జింగ్ లేదని తెలిపారు . ప్రస్తుతం అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బ్రాండ్ నవంబర్ 21 నుంచి అందరికి అందుబాటులో ఉంటుంది . అమెజాన్ ఇండియా ద్వారా ఈ మోడల్ ఇండియా లో అందుబాటులోకి వస్తుంది.

పెటే లా (వన్ ప్లస్ CEO ) ఈ వైర్ లెస్ ఛార్జ్ పెట్టకపోవడానికి ముక్యంగా రెండు కారణాలు తెలిపాడు .
 వన్ ప్లస్ 5T మొబైల్ ఒక రోజు బ్యాట్టరీ రావలంటే 20 వాట్ట్స్ పవర్ అవసరమవుతుంది. దాన్ని ప్రస్తుతం వన్ ప్లస్ లో ఉపయోగిస్తున్న DASH CHARGE టెక్నాలజీ ద్వారా అర్ధ గంటలో పొందవచ్చు. కాని ఈ వైర్ లెస్ టెక్నాలజీ వలన మాక్సిమం 15 వాట్ట్స్ మాత్రమే వస్తుంది. అది కూడా ఛార్జింగ్ పాడ్ పై ఎన్ని డివైస్ లు ఉన్నాయి అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే DASH CHARGE నే ప్రిఫర్ చేసినట్లు మొదటి కారణంగా తెలిపాడు.
ఇంకో కారణంగా ఈ వైర్ లెస్ ఛార్జ్ వలన లేట్ గ ఛార్జ్ అవ్వడమే కాకుండా ఛార్జ్ చేసేపుడు ఛార్జింగ్ పాడ్ పైననే మొబైల్ ఉంచాలి . దీని వలన ఛార్జ్ పెట్టినపుడు ఇంకే పని చయ్యలేరు అని తెలిపారు . #OnePlus5T ధర కూడా వన్ ప్లస్ అంతే ఉంటుంది అని స్పష్టం చేసారు . కొత్తగ ఈ మోడల్ లో 3.5 MM జాక్ ని తిరిగి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ 3.5 MM జాక్ వన్ ప్లస్ పాత మోడల్స్ లో లేదు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *