Mobile Uncategorized

మూడు నిమిషాల్లో 150K+ అమ్ముడైన #RedMiY1 మొబైల్స్

 

షియోమి కొద్దిరోజుల క్రితమే తమ కొత్త సిరీస్ మొబైల్ లంచ్ చేసిన సంగతి తెలిసిందే . సెల్ఫీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఫోన్ తక్కువ ధరలో లభించడమే కాకుండా మార్కెట్ లో దొరికే ఇతర సెల్ఫీ ఫోన్ ల కంటే ఉత్తమ క్వాలిటీ తో ఫోటోలను అందిస్తుంది . షియోమి  బ్రాండ్ లో ఇప్పటివరకు ఏ మొబైల్ కి బ్రాండ్ అంబాసిడర్  లేకపోయినప్పటికీ , ఈ RedMiY1 కు మాత్రం కత్రిన కైఫ్ ని బ్రాండ్ అంబాసిడర్ గ నియమించుకున్నారు .

Buy RedMiY1 Here : Click Here To Buy

RedMiY1 మొట్ట మొదటి ఫ్లాష్ సేల్ నిన్ననే జరిగింది . అందులో 1,50,000 మొబైల్స్ 3 నిమిషాల్లోనే అయిపోయాయి అని కంపెనీ MD మనోజ్ కుమార్ జైన్ ట్వీట్ ద్వారా తెలిపారు . RedMiY1 మొబైల్ లో రెండు వెర్షన్ లు విడుదల చేసారు. RedMiY1 అలాగే RedMiY1 Lite . RedMiY1 Lite 2 GB RAM మరియు 16 GB అంతర్గత మెమరీ తో 5 MP సెల్ఫీ కెమెరా తో విడుదల అయింది .

ఇక RedMiY1 లో 3 GB + 32 GB మరియు 4 GB + 64 GB వెర్షన్ లు విడుదల అయ్యాయి . ఈ రెండింటి లోను 16 MP సెల్ఫీ కెమెరా ఫ్లాష్ సహితంగా ఉంది. వీటిలో డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఉంది . మిగతా రెడ్ మి మొబైల్స్ లాగా సిమ్ కార్డు కాని , మెమరీ కార్డు కాని ఎదో ఒక్కటే వాడె అవసరం లేకుండా మెమరీ కార్డు కే ప్రత్యేకంగా స్లాట్ కేటాయించారు .

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *