Latest Tech Uncategorized

తలుపులు బద్దలయ్యేలా చేసిన అమెజాన్ అలెక్సా

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలని ఉత్తేజ పరుస్తున్న అంశం . గూగుల్ , అమెజాన్ , మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి కొన్ని టెక్ ప్రొడక్ట్స్ రిలీజ్ చేసాయి . ఈ ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ మన మాటల ద్వారా , మనం ఇంటర్నెట్ లో సెర్చ్ చేసే అంశాల ద్వారా మన ఇష్టా ఇష్టాలపై ఒక అవగాహనకు వచ్చి మనకు ఉపయోగపడేలా సహాయం చేస్తూ ఉంటాయి .
అలంటి ఒక ఉత్పత్తే అమెజాన్ కంపెనీ రూపొందించిన అలెక్సా . ఈ అలెక్సా ని మనం మాటల ద్వారా నే ఆదేశించవచ్చు . ఈ అలెక్సా ద్వారా మనం ఆన్ లైన్ లో మనకు కావలసిన వస్తువులు ఆర్డర్ పెట్టొచ్చు . మనకు కావలసిన సాంగ్ ప్లే చెయ్యమని చెప్పొచ్చు . మనకు ఎవైన పనులు ఉంటె ముందే చెప్తే ఆ సమయానికి గుర్తు చేస్తుంది . ఇంట్లో స్విచ్ లు ఆన్ / ఆఫ్ చెయ్యమని చెప్పొచు . ఇలా చాల రకాలుగా ఉపయోగపడతాయి . కొంత అవగాహన కోసం క్రింద ఇచ్చిన వీడియో చుడండి .

ఇలా ఉపయోగపడే అలెక్సా ని జర్మనీ లో నివసించే ఒలివర్ అనే వ్యక్తి ఉపయోగిస్తున్నాడు . అతను వేరే నగరానికి వెకేషన్ కోసం వెళ్ళాడు .ఇంట్లో ఎవ్వరు లేరు . ఐన సరే అది అర్ధ రాత్రి ఆటోమేటిక్ గా గట్టిగ సాంగ్ విన్పించడం మొదలెట్టింది . పక్క ఇళ్ళలో ఉండే వారు ఎంత తలుపులు బాదినా సరే ఎవ్వరు తీయకపోయేసరికి పోలీస్ లకి చెప్పారు . పోలీస్ లు తలుపులు బద్దలు కొట్టి అలెక్సా ని ఆఫ్ చేసి , తలుపులు బాగు చేయించి కొత్త తాళం వేసి తాళం చెవి తీసుకు వెళ్లారు . వెకేషన్ నుంచి వచ్చిన ఒలివర్ తాళం పని చేయకపోవడం తో పోలీస్ స్టేషన్ కు వెళితే అసలు విషయం తెలిసింది . అంతే అప్పట్నుంచి అలెక్సా ను ఉపయోగించడం లేదు .

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై మనం ఇంకా పట్టు సాధించలేదు అనడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలు ఈ మధ్య చోటు చేసుకుంటున్నాయి . కొంత మంది టెక్ వ్యాపార వేత్తలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని వ్యతిరేకిస్తున్నారు . ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మనవ జీవితాలని ఎటు తీసుకు వెలతాయో వేచి చూడాల్సిందే .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *