Apps Cyber Security Latest Tech Uncategorized

వేలాది యాప్ / సైట్ లలో క్రిప్టో మైనింగ్ | అసలు క్రిప్టో మైనింగ్ అంటే ఏంటి ???

వినియోగదారుల CPU పవర్ ని ఉపయోగించుకుని క్రిప్టో కాయిన్ లు సంపాదించడమే క్రిప్టో మైనింగ్. బ్లాక్ చైన్ టెక్నాలజీ లో ప్రతీ transaction యొక్క వివరాలు Hash రూపంలో సేవ్ అవుతాయి . ఈ hash అనేది ఆ transaction కు ID లాంటిది . వీటిని జనరేట్ చెయ్యడానికి క్రిప్టో మైనింగ్ అనే పద్దతిని ఉపయోగిస్తారు. బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కాయిన్ ల క్రేజ్ తారా స్థాయికి చేరుకోవడం వలన ఈ క్రిప్టో మైనింగ్ కూడా చాల పెరిగిపోయింది .

ఈ క్రిప్టో మైనింగ్ కు సంబంధించిన కోడ్ జావా స్క్రిప్ట్ ఫార్మట్ లో దొరుకుతుంది . దీనిని వెబ్ సైట్ నిర్వాహకులు తమ సైట్ లో పెట్టడం వల్ల ఆ సైట్ ఉపయోగించే వినియోగ దారుల యొక్క CPU పవర్ ని ఉపయోగించుకుని ఈ hash లు సృష్టించడం జరుగుతుంది . మాములుగా అయితే ఇది చాల సులభమైన పనే , కానీ దీనివల్ల పరిమితంగా ఉన్న క్రిప్టో కాయిన్ ల సంఖ్య త్వరగా తగ్గిపోతుందని ప్రూఫ్ చెకింగ్ అనే పద్దతిని జోడించారు . ఈ ప్రూఫ్ చెకింగ్ లో జనరేట్ చెయ్యబడిన hash నిజమైనదా లేక నకిలిగా సృష్టించినద అన్నది తేల్చడం జరుగుతుంది . ఈ ప్రాసెస్ అంత ఒక్కరే చెయ్యడం అదీ కూడా ఇంత విస్తృతంగా పెరిగిన క్రిప్టో కాయిన్ ల వాడకం వల్ల చాల కష్టమైనా పని . ఈ పనిని సులభతరం చెయ్యడానికి జావా స్క్రిప్ట్ కోడ్ ద్వారా మైనింగ్ చేస్తే ప్రతీ విజయవంతమైన transaction కు 25 బిట్ కాయిన్ లు ఇస్తారు .

ఇలా డబ్బులు సంపాదించడానికి వినియోగదారులకి తెలీకుండా యాప్ డెవలపర్లు , వెబ్ సైట్ డెవలపర్లు తమ సైట్ / యాప్ లలో ఈ కోడ్ ఉంచి మనం ఆ సైట్ / యాప్ వాడుతున్నపుడు మన CPU ని వల్ల క్రిప్టో మైనింగ్ కోసం ఉపయోగించేలా చేస్తారు . ప్రస్తుతం ఈ కోడ్ ని ఒక పాపులర్ వర్డ్ ప్రెస్ ప్లగ్ ఇన్ లో గుర్తించి దాన్ని తీసేయిన్చినట్టు వర్డ్ డిఫెన్సు సంస్థ తెలిపింది . ఇదే కోడ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో చాల యాప్ లలో ఉంది అని సమాచారం . దీనిని మాములుగా అయితే కనిపెట్టలేం . CPU టాస్క్ లపై అవగాహన ఉంటె దీన్ని కనిపెట్టొచ్చు . గూగుల్ క్రోమ్ లో ఈ క్రిప్టో మినింగ్ ను నియంత్రించడానికి Miner Block అనే extension అందుబాటులో ఉంది . ఈ extension క్రిప్టో మైనింగ్ జరిపే సైట్ లను లోడ్ అవ్వనివ్వకుండా ఆపేస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *