Uncategorized

నవంబర్ 15 న లాంచ్ చెయ్యనున్న ఫ్లిప్ కార్ట్ సొంత మొబైల్ Billion Capture+

ఫ్లిప్ కార్ట్ సంస్థ ఇప్పటివరకు మొబైల్స్ , ఎలక్ట్రానిక్స్ , బుక్స్ మొదలైనవి తమ వెబ్ సైట్ ద్వారా అమ్మకం మాత్రమే చేస్తుండగా ఇప్పుడు కొత్తగా సొంతంగా మొబైల్ బ్రాండ్ ని తీసుకు రానుంది . Billion అనే బ్రాండ్ పేరుతో మొబైల్స్ తయారీ చేపట్టింది . Billion Capture Plus పేరుతో Billion బ్రాండ్ లో మొదటి మొబైల్ ని ఈ నవంబర్ 15 న విడుదల చేస్తున్నట్లు తమ వెబ్ సైట్ flipkart.com లో అధికారికంగా ప్రకటించింది.

ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ఫోన్ ఫీచర్ ల గురించి సమాచారం ఏమి లేనప్పటికి కొన్ని ముక్యమైన ఫీచర్ ల గురించి మాత్రం ప్రకటించింది . అందులో ముఖ్యంగా డ్యూయల్ కెమెరా . ఈ డ్యూయల్ కెమెరా ఎక్కువ కలర్ లని Capture చేస్తుందని , bokeh ఎఫెక్ట్ , సూపర్ నైట్ మోడ్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వంటి ఫీచర్ లు ఉన్నట్టు పోస్టర్ లో తెలిపారు.

ఛార్జింగ్ పరంగా నిమిషాల ఛార్జ్ తో గంటలపాటు మొబైల్ ఉపయోగించవచ్చు అని ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ గురించి పోస్టర్ లో ఉంచారు. గూగుల్ పిక్సెల్ 2 లాగానే అపరిమిత క్లౌడ్ స్టోరేజ్ తో ఫోటోలని ,వీడియో లని దాచుకోవచ్చని తెలిపారు.Billion capture+ కు ఫింగర్ ప్రింట్ సపోర్ట్ కూడా ఉన్నట్టు ఫోటో ల ద్వారా తెలుస్తుంది. ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారితంగా ఈ మొబైల్ పని చేస్తుందని తెలిపారు. 125 నగరాలలో 130 సర్వీస్ సెంటర్ ల అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. నవంబర్ 15 వ తేదీన టెలికాం సంస్థల భాగస్వామ్యం తో ఆఫర్ లని ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *