Apps Latest Tech Mobile Uncategorized

స్టోరేజ్ సమస్యలు తగ్గించడానికి ఆండ్రాయిడ్ 8.0 లో కొత్త ఫీచర్

ఆండ్రాయిడ్ లో అంతర్గత మెమరీ ఎక్కువగా ఉన్న మొబైల్స్ తప్పిస్తే మిగతా అన్ని మొబైల్ వినియోగదారులు ఈ సమస్య ను ఎప్పుడో అప్పుడు ఎదుర్కొనే ఉంటారు . యాప్స్ తరచుగా అప్ డేట్ అవుతూ ఉండడం వల్ల వాటి మెమరీ పెరిగిపోయి RAM స్లో అయిపోవడం , మెల్ల మెల్లగా హ్యాంగ్ అయిపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు ఈ మెమరీ సమస్య వలన వస్తాయి .

ఆండ్రాయిడ్ ఓరియో (8.0) లో ఈ సమస్యను పరిష్కరించబోతున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా కొద్ది రోజులుగా అస్సలు వినియోగించని యాప్స్ యొక్క డేటా ని తొలగించే పద్ధతి ద్వారా మెమరీ సమస్యని తొలగించబోతున్నట్లు సమాచారం. కొద్ది రోజులుగా బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వని యాప్స్ ని , వేరే ఏ యాప్ ద్వారా ఉపయోగించబడని యాప్ లని , యూజర్ ఓపెన్ చెయ్యని యాప్ లని కొద్ది రోజులుగా అస్సలు వినియోగించని యాప్స్ జాబితాలో కి జత చేస్తుంది . జత చేసిన యాప్ లలో అవసరం లేని క్యాచ్ మెమరీ ని , ఇంకా అవసరం లేని డేటా ని డిలీట్ చేసేలా ఈ ఫీచర్ ఉంటుంది . దీన్ని ఇంకా బీటా టెస్టింగ్ చేస్తున్నారు . ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మెమరీ కార్డు సౌకర్యం లేని వినియోగారులకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *