Latest Tech Uncategorized

త్వరలో మొట్ట మొదటి ట్రిలియన్ డాలర్ కంపెనీ గా ఆపిల్

ఆపిల్ ఈ సంవత్సరం ఐఫోన్ 8 అలానే , ఐఫోన్ X మొబైల్ లను విడుదల చేసింది . iPhone 8 అమ్మకాలు అంత ఆశాజనకంగా ఉండనప్పటికి , iPhone X అమ్మకాలు మాత్రం జోరుగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం సేల్ జరిపిన ఈ iPhone X మొబైల్ నిమిషాల్లోనే మొత్తం స్టాక్ అమ్ముడయిపోవడం తెల్సిన విషయమే. తాజా గా ఆపిల్ సంస్థ మొత్తం విలువ 900 బిలియన్ డాల్లర్లకు చేరింది . స్టీవ్ జాబ్స్ నుంచి సంస్థ పగ్గాలు టిమ్ కుక్ చేతికి వచ్చాక కంపెనీ విలువ ఏకంగా రెండు రెట్లు పెరిగి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన సంస్థ గా అవతరించింది . త్వరలోనే మొట్ట మొదటి ట్రిలియన్ డాలర్ కంపెనీ గా అవతరించబోతుంది.

ఆపిల్ ట్రిలియన్ డాలర్ కంపెనీ గా అవతరించడానికి ఉన్న అవకాశాల గురించి ఆలోచిస్తే , ఆపిల్ సంస్థ త్వరలో విడుదల చేయబోయే ఎలక్ట్రానిక్ పరికరాలు / అనువర్తనాలు గురించి తెలుసు కోవాలి. ఆపిల్ సంస్థ నుంచి త్వరలో తక్కువ ధరకే లభించే iphone X ని విడుదల చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఇంకా ఎక్కువ మంది వినియోగదారులకి చేరుతుంది అన్నది తెలిసిందే. ఆగ్మెంటేడ్ రియాలిటీ కి సంబంధించి ఆపిల్ ప్రస్తుతం ప్రయోగాల దశలో పరిశోధనలు చేస్తుంది. ఆపిల్ CEO టిమ్ కుక్ AR కు సంబందించిన డివైస్ లని 2018 లి విడుదల చేయనున్నట్లు సమాచారం . ఆపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్ ని అమెజాన్ అలెక్స లాగే పరికరాన్ని తయారు చేసి 2018 ప్రథమార్థం లో విడుదల చేసే యోచనలో ఆపిల్ ఉంది అని సమాచారం. ఆపిల్ సిరి ని హోమ్ పాడ్ లాగా డిజైన్ చేసి అమ్మకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇన్ని ఆవిష్కరణలు జరుపుతున్న ఆపిల్ కచ్చితంగా 2018 ప్రథమార్థం లొనే మొదటి ట్రిలియన్ డాలర్ కంపెనీ గా అవతరిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *