Apps Latest Tech Uncategorized

రివెంజ్ పోర్న్ సమస్య కు ఫేస్ బుక్ సులభమైన పరిష్కారం

ఈ మధ్య రివెంజ్ పోర్న్ భాదితుల సంఖ్య చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నెట్ లో అసభ్య కరమైన వ్యక్తిగత చిత్రాలు పెట్టడం పెరిగిపోయింది . ఇద్దరు ప్రేమికుల మధ్య పొరపచ్చాలు వచ్చినపుడు , వారి మధ్య అంతర్గతంగా తీసుకున వ్యక్తిగత చిత్రాలను నెట్ లో పెట్టి బెదిరించడానికి , లేదా అవమాన పరచడానికి ఉపయోగించడమే రివెంజ్ పోర్న్ .

ఈ సమస్యను పరిష్కరించడానికి పేస్ బుక్ ఒక పరిష్కార మార్గం ఆలోచించింది .AI (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సహాయంతో ఒక సాఫ్ట్ వేర్ ని ఇందుకోసం డిజైన్ చేస్తున్నట్లు సమాచారం .ఏ ఫోటోలు అయితే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని ముందే ఆ సాఫ్ట్ వేర్ కు పంపిస్తే , ఆ సాఫ్ట్ వేర్ ఆ ఫోటో యొక్క సిగ్నచర్ పాయింట్ లని గుర్తు పెట్టుకుని ఎవరైనా వాటిని ఉప్ లోడ్ చెయ్యడానికి ప్రయతిస్తే వాటిని అప్ లోడ్ అవ్వనివ్వకుండా ఆపేస్తుంది . ఇదంతా సాఫ్ట్ వేర్ ఏ విశ్లేషించి పని చేస్తోంది. మనిషి అవసరం లేకుండా ఇదంతా జరుగుతుంది కాబట్టి , ఎవరైనా చూస్తారు అనే సమస్య కూడా ఉండదు. ఈ ఆప్షన్ ని త్వరలో యాప్ మరియు సైట్ లో పెడతారు. దీని వల్ల ఫేస్ బుక్ లో మాత్రమే రక్షణ లభిస్తుంది. వేరే వెబ్ సైట్ లలో ఇలాంటి రక్షణ లేదు కాబట్టి మన జాగ్రతలో మనం ఉండడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *