Mobile Uncategorized

ఎరుపు రంగు వెర్షన్ తో Mi5x ఫోటో లు

నిన్న రాత్రి షియోమి కంపెనీ ఎరుపు రంగులో Mi5x మొబైల్ ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది . షియోమి కంపెనీ లో ఎరుపు రంగు మొబైల్ ఇదే మొదటిది . ఆపిల్ లోను , ఒప్పో కంపెనీ లోనూ ఎరుపు రంగు మొబైల్స్ ఎప్పట్నుంచో ఉన్నాయి . రెడ్ కలర్ వెర్షన్ విడుదల ని పురస్కరించుకుని షియోమి కొన్ని ఫోటోలని విడుదల చేసింది .

ఈ Mi5x కలర్ లో మాత్రమే వేరేగా ఉంటుంది . మిగతా ఫీచర్లన్నీ అలాగే ఉంటాయి . Mi5x 5.5 HD స్క్రీన్ తో 4GB RAM , 64 GB అంతర్గత మెమరీ తో లభిస్తుంది . వెనుక వైపున 2 12 మెగా పిక్సెల్ కెమెరా లు నలుపు రంగులో ఉంది మంచి లుక్ ని అందిస్తున్నాయి. ముందు వైపున 5 MP కెమెరా తో 3,800 mAh బ్యాటరీ కెపాసిటీ తో ఆండ్రాయిడ్ నౌగట్ పై పని చేస్తోంది. ఇదే కాక #RedMiNote4X ని గ్రీన్ కలర్ లోను, #Mi6 ని , #MiNote3 ని బ్లూ కలర్ లోను తీసుకుని రాబోతుంది అని సమాచారం.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *