Apps Latest Tech Uncategorized

Accesibility ఉపయోగించే యాప్స్ ని తొలగించనున్న గూగుల్

Accesibility ఆప్షన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం లో యూజర్లకి వేరే వేరే మార్గాలలో ఒక యాప్ ని ఉపయోగించే వీలు కల్పిస్తుంది. ఈ Accesibility ద్వారా ఒక యాప్ , వేరే యాప్ యొక్క చర్య లని   పరిశీలించే అవకాశం దొరుకుతుంది.

ఉదాహరణకు ఏదైనా యాప్ లో బుక్ చదువుతున్నప్పుడు ,ఇంకో యాప్ లో డిక్షనరీ ఓపెన్ చేసే అవసరం లేకుండా , బుక్ లోని పదం పై లాంగ్ ప్రెస్ చేస్తే డిక్షనరీ యాప్ లో నుంచి అర్థం స్క్రీన్ పై డిస్ప్లే అయ్యేలా చెయ్యాలంటే ఈ Accessibility ఆప్షన్ అవసరం. కానీ గూగుల్ ఈ accesibility  ని వాడుకునే యాప్స్ ని ప్లే స్టోర్ లో నుంచి తొలగించాలని ప్రయత్నిస్తుంది. ఈ accesibility  వాడుకునే యాప్ లలో ముఖ్యంగా LastPass , Tasker, Universal copy లాంటి ప్రముఖ మైన యాప్స్ ఉన్నాయి. వీటి డెవలపర్ లతో గూగుల్ చర్చించినట్లు సమాచారం. ఈ Accesibility ఎందుకు ఉపయోగిస్తున్నారు అన్నదానికి సరైన సమాధానం చెప్తేనే ఆ యాప్ ని తొలగించకుండా ఉంచుతారని లేకపోతే తొలగించనున్నట్లు సమాచారం. ఈ Accesibility ఆప్షన్ వికలాంగులకు మాత్రమే సహాయ పడేలా ఉండాలని గూగుల్ భావిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *