Mobile Uncategorized

OnePlus 5t లీక్ అయిన పూర్తి వివరాలు.

ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా ఉన్న మోడల్ వన్ ప్లస్ 5t. ఫ్లాగ్ షిప్ (హై ఎండ్) మొబైల్ రేంజ్ లో ఇప్పటికే ఉన్న వన్ ప్లస్ 5 ధరకే ఈ మొబైల్ కూడా లభిస్తుంది అన్నది వన్ ప్లస్ 5 వినియోగదారులకి మింగుడు పడని విషయం. ఇప్పటి వరకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న హై ఎండ్ బెజల్ లెస్ ఫోన్ లు ఐఫోన్ X, సామ్ సంగ్ గలాక్సీ నోట్ 8 చాలా ఎక్కువ ధరలో ఉండగా ఈ మొబైల్ భారీ తేడాతో అందుబాటులో ఉండడం ఈ మొబైల్ పై అంచనాలకు కారణం.

ఈ మొబైల్ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 16 న లాంచ్ అవ్వనుంది.

ఫీచర్ల విషయానికి వస్తే OnePlus5T కూడా OnePlus5 లానే 2.45 GHz ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో లభిస్తుంది. RAM కూడా OnePlus5 లానే 6 GB ,8 GB వెర్షన్ లలో లభిస్తుంది. అంతర్గత మెమరీ కూడా OnePlus5 లనే 64 GB , 128 GB వెర్షన్ లలో లభిస్తుంది. ఇందులో కూడా మెమరీ కార్డ్ ఉపయోగించే స్లాట్ లేదు.

స్క్రీన్ విషయానికి వస్తే OnePlus5 లా కాకుండా ఇందులో ఫుల్ బెజల్ లెస్ స్క్రీన్ ఉపయోగించారు. OnePlus5 లా 16:9 స్క్రీన్ కాకుండా , OnePlus5T లో 18:9 స్క్రీన్ ఉపయోగించారు. ఈ డిస్ప్లే 6.01 ఇంచ్ అమోలెడ్ గ్లాస్ తో 1080 x 2160 రెసొల్యూషన్ తో 401 ppi (పిక్సెల్ పర్ ఇంచ్) తో లభిస్తుంది. దీంట్లో సన్ లైట్ లో కూడా బాగా కనిపించేలా ప్రత్యేక అల్గోరిథం ఉపయోగించినట్లు తెలిపారు.

కెమెరా విషయానికి వస్తే OnePlus5 లానే డ్యూయల్ కెమెరా ఉన్నప్పటికీ OnePlus5T లో మాత్రం లో లైట్ ఫోటోల కోసం కెమెరా ని కొంచెం ట్వీక్ చేసినట్లు సమాచారం. OnePlus5T లో ఒక 16 MP మెయిన్ కెమెరా గా, దానికి సపోర్టివ్ గా 20 MP కెమెరా ఉపయోగించారు. ఈ OnePlus5T లో కూడా ఫీల్డ్ డెప్త్ ఎఫెక్ట్ , bokeh ఎఫెక్ట్ ఉన్నట్లు తెలిపారు. ఈ కెమేరా తో 4K వీడియోలు కూడా చిత్రించ వచ్చు. ఫ్రంట్ కెమెరా గా 16 MP కెమెరా ని ఉపయోగించారు.

OnePlus5T ఆండ్రాయిడ్ నౌగట్ ఆధారితంగా పని చేస్తుంది. దీని బ్యాటరీ కెపాసిటీ 3,300 mAh . డాష్ ఛార్జ్ టెక్నాలజీ ని ఇందులో కూడా కొనసాగించారు. OnePlus5T లో ఫింగర్ ప్రింట్ సెక్యురిటి వెనుక వైపున ఉంచారు. ఇదే ఫింగర్ ప్రింట్ OnePlus5 లో ముందు వైపున ఉంది.

ధర విషయానికి వస్తే ఇండియా లో 6 GB వెర్షన్ 32,999 , 8 GB వెర్షన్ 37,999 రూపాయలు ఉండవచ్చు. ఎందుకంటే OnePlus5T కూడా OnePlus5 ధరకే లభిస్తుందని CEO ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మొబైల్ ఇండియా లో అమెజాన్ సైట్ ద్వారా నవంబర్ 21 నుంచి అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *