Latest Tech Uncategorized

0.3 % మార్కెట్ తో ఆండ్రాయిడ్ ఓరియో

ఆండ్రాయిడ్ వెర్షన్ లలో లేటెస్ట్ వెర్షన్ అయిన ఆండ్రాయిడ్ ఓరియో విడుదల అయ్యి చాలా కాలం అయినా ఇంకా మార్కెట్ లో ఎక్కువ డివైస్ లలో ఆక్టివేట్ కాలేదు. iOS నే తీసుకుంటే ఏ కొత్త వెర్షన్ విడుదల అయిన సరే పాత iPhone లలో కూడా ఈ కొత్త వెర్షన్ పని చేస్తోంది. కానీ ఆండ్రాయిడ్ లో ఇలా జరగకపోవడం వల్లే కేవలం 0.3 % మాత్రంమే ఆండ్రాయిడ్ డివైస్ లు మార్కెట్ లు రన్ అవుతున్నాయి.

ఆండ్రాయిడ్ ఓరియో అప్ డేట్ గూగుల్ ఆండ్రాయిడ్ సంస్థ వదిలిన వెంటనే మొబైల్ డివైస్ లకు అందుబాటులోకి రాదు. ప్రతీ కంపెనీ తమ డివైస్ కు సరిపోయేలా దాన్ని మార్చి విడుదల చెయ్యాలి. ఇది కొంచెం ఎక్కువ శ్రమ తో కూడుకున్న పనే. మార్ష్ మాల్లో నే ఇప్పటికి ఎక్కువగా రన్ అవుతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం. చాలా మొబైల్ లకి ఇప్పుడిప్పుడే నౌగట్ OS అప్ డేట్ ని రిలీజ్ చేస్తున్నారు. షియోమి బ్రాండ్ లో 80% మొబైల్ లకి ఈ నెలలోనే నౌగట్ అప్ డేట్ వచ్చింది. వీళ్ళందరికి ఓరియో రావాలంటే కనీసం 4 నెలలు అయిన పట్టొచ్ఛు. ఈ లోపున గూగుల్ సంస్థ మరో కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ విడుదల చేస్తుంది. ఆండ్రాయిడ్ కి iOS కి ఉన్న భేదాలలో ఇది ముఖ్యమైనది. iOS లో దాదాపుగా అన్నిటికీ కొత్త వెర్షన్ వచ్చేస్తుంది. దీనివల్ల మొబైల్ డివైస్ లు సెక్యూర్ గా ఉంటాయి. ఆండ్రాయిడ్ OS కి , మొబైల్ కంపెనీలకు ఉండే దూరం ఇప్పట్లో తగ్గేలా లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *