Mobile Uncategorized

#1 మొబైల్ బ్రాండ్ గా షియోమి

ఇండియాలో  నెంబర్ #1 బ్రాండ్ గా షియోమి అవతరించింది. ఈ విషయం షియోమి కంపెనీ తమ ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ పేజీ ల ద్వారా వెల్లడించింది. #RedMiNote4 #RedMi4 మొబైల్ లు అత్యధికంగా అమ్ముడు పోవడంతో , #Xiaomi బ్రాండ్ ఈ ఘనత ను సాధించగలిగింది.

IDC రీసెర్చ్ సంస్థ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ Q3 సేల్స్ పరంగా షియోమి భారత్ లో అన్ని మొబైల్ బ్రాండ్ అమ్మకాలను వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా వెలిసింది. Q2 లో సామ్ సాంగ్ కంపెనీ కంటే 0.5 % వెనుక ఉన్న షియోమి , Q3 లో దాన్ని అధిగమించి 23 % మార్కెట్ తో దూసుకెళ్తుంది. షియోమి సంస్థ అమ్మకాలు ప్రతీ ఏడాది 300 % పెరుగుదలతో అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ క్వార్టర్ లో (Q3) 9.2 మిలియన్ ( దాదాపుగా 92 లక్షలు ) మొబైల్ అమ్మకాలు జరిపినట్టు షియోమి తెలిపింది. ఈ Q3 లొనే గూగుల్ సౌజన్యంతో  #MiA1 మొబైల్ ని విడుదల చేసింది. RedMi ఇండియా ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ట్వీట్ ను రీ ట్వీట్ చేసి redmi note 4 మొబైల్ ను గెలిచే అవకాశం ను షియోమి కల్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *