Apps Latest Tech Uncategorized

UC broswer ను తొలగించిన గూగుల్ ప్లే స్టోర్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం రాకముందునుంచే సింబియన్ ఆపరేటింగ్ సిస్టం లో టాప్ బ్రౌజర్ గా ఉన్న UC Browser ని గూగుల్ ప్లే తొలగించింది. UC Browser ని తొలగించే సమయానికి ఆ యాప్ కి దాదాపుగా 500 మిలియన్ లకు పైగా డౌన్ లోడ్ లు ఉన్నాయి.

తొలగించడానికి కారణాలు ఏవి ఇంకా తెలియనప్పటికి , మాలిషియస్ లింకులా ద్వారా యాప్ ఇంస్టాల్ జరిపేలా చేసినందున తొలగించింది అని అనుకుంటున్నారు. టొరెంట్ లాంటి సైట్ లలో వేరే ఎదో ఫైల్ డౌన్లోడ్ లింక్ బదులుగా UC browser లింక్ ఉంచడం లాంటి అనైతిక పద్ధతుల ద్వారా యాప్ ఇంస్టాల్ చేసేలా చెయ్యడం వల్లే ఇది జరిగి ఉండొచ్చు అని సమాచారం. UC Union సంస్థ నుంచి UC Browser కు సంబంధించిన ప్రమోషన్ మొత్తం ఆపి వేయమని అఫిలియేట్ పార్టనర్ లు అందరికి మెయిల్ వచ్చినట్లు ట్విట్టర్ లో ఒక పార్టనర్ తెలిపాడు. UC Browser కు సబంధించిన ఉద్యోగి ఒకరు గూగుల్ తో UC browser సంస్థ మంతనాలు జరూపుతూ ఉందని, 30 రోజులలో మళ్ళీ యాప్ ప్లే స్టోర్ లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆండ్రాయిడ్ మొదలైన మొదట్లో దాదాపుగా 60 % మార్కెట్ UC Browser కు ఉండగా,తర్వాత పూర్తిగా తగ్గిపోయి క్రోమ్ బ్రౌజర్ ఎక్కువ శాతం మార్కెట్ ను చేజిక్కించుకుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *