Latest Tech Uncategorized

మొజిల్లా కొత్త ఫైర్ ఫాక్స్ క్వాంటమ్ బ్రౌజర్

మొజిల్లా కొత్త Firefox Quantum Browser ని లాంచ్ చేసింది. పేరుకు తగినట్టే ఈ బ్రౌజర్ చాలా వేగవంతమైనదని అలాగే సురక్షితమైనది అని మోజిల్లా తెలిపింది. ఈ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కంటే ఎంతో వేగవంతం అయిందని మొజిల్లా కంపెనీ తెలిపింది.

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఇప్పటివరకు ఉన్న బ్రౌజర్ లలో కెల్లా ఎంతో వేగవంతమైనది, కానీ క్రోమ్ చాలా ఎక్కువగా CPU యొక్క పవర్ ని ఉపయోగించుకుంటుంది. దీని వల్ల వేరే అప్లికేషన్ లు వేగంగా పని చేయలేవు. కానీ ఈ Firefox Quantum Browser ఎక్కువ CPU వనరులని వినియోగించకుండానే అత్యంత వేగవంతమైన బ్రౌజింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. గూగుల్ క్రోమ్ కంటే 30 % తక్కువ CPU వనరులతోనే పని చేస్తూ , ఇతర అప్లికేషన్ లని ఒకే సమయంలో వినియోగించడానికి ఏ ఇబ్బంది లేకుండా ఈ క్వాంటమ్ బ్రౌజర్ డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ బ్రౌజర్ ని Firefox వారి Rust ప్రోగ్రామింగ్ భాష ని ఉపయోగించి రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *