Latest Tech Mobile Uncategorized

RedMi Note 5 లీక్ అయిన వివరాలు. 

షియోమి కంపెనీ నుంచి ఇండియా లో భారీ అమ్మకాలు జరిగిన మొబైల్ గా రికార్డ్ లు సృష్టించిన RedMi Note 4 కు తరువాతి జనరేషన్ మొబైల్ గా విడుదల అవుతున్న RedMi Note 5 పై మార్కెట్ లో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మొబైల్ ని త్వరలో లాంచ్ చేసేందుకు షియోమి ప్రయతిస్తున్నట్లు కొన్ని అంశాల ద్వారా తెలుస్తుంది.

ఆన్ లైన్ రిటైల్ సంస్థ JD.COM షియోమి కి సంబంధించిన మొబైల్ కోసం తమ వెబ్ సైట్ లో ఫోటో లేని ఒక ప్రొడక్ట్ పేజీ ని సృష్టించింది. దాన్ని RedMi Note 5 గా అందరూ అనుకుంటున్నారు. ఇంతకు ముందే చైనా లో TENAA మొబైల్ సర్టిఫికేషన్ కోసం షియోమి కి సంబంధించిన మొబైల్ ను సర్టిఫై చెయ్యడం తెలిసిందే. ఆ మొబైల్ కూడా RedMi Note 5 యే అని అనుకుంటున్నారు. కొద్దీ రోజుల క్రితమే RedMi Note 4 మొబైల్ ధర తగ్గించిన సంగతి తెలిసిందే. ఇవన్నీ గమనిస్తే చాలా తొందరలోనే RedMi Note 5 విడుదలని సూచిస్తున్నాయి.

TENAA సర్టిఫికేషన్ దగ్గర లీక్ అయిన వివరాల ప్రకారం 18:9 డిస్ ప్లే తో ఈ మొబైల్ లభిస్తుంది. మాములుగా RedMi Note 4 మొబైల్ 16:9 ఉంటే ఈ మొబైల్ అంచులు లేకుండా 18:9 ఉండడం విశేషం. ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్ తో, 16 MP డ్యూయల్ కెమెరా వెనుక వైపు , 8 MP ముందు వైపు కెమెరాలతో ఈ మొబైల్ రిలీజ్ అవ్వబోతుంది. 4,000 mAh బ్యాటరీ కెపాసిటీ తో ఈ మొబైల్ లభిస్తుంది. ఈ మొబైల్ 3 GB + 32GB మరియు 4GB + 64 GB వెర్షన్ లలో లభిస్తుంది. MIUI9  ప్రీ – ఇంస్టాల్ అయ్యి ఉండి ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తోంది. ఈ మొబైల్ త్వరలో ముందుగా చైనా లో రిలీజ్ అయ్యి, తరువాత మిగతా దేశాలలో రిలీజ్ అవుతుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *