Latest Tech Uncategorized

BitCoin పై స్పందించమని RBI ని కోరిన సుప్రీం కోర్టు

ఇండియాలో అంతకంతకూ పెరిగిపోతున్న బిట్ కాయిన్ వినియోగంపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు RBI ని ఆదేశించింది. బిట్ కాయిన్ వినియోగం ఇండియాలో కొనసాగించాలా లేక నియంత్రించాలా అన్నదానిపై విశ్లేషణ చెయ్యమని సూచించింది.

ఇండియా నుంచి దాదాపుగా రోజుకు 2,000 లకు పైగా బిట్ కాయిన్ ట్రాన్సక్షన్ లు జరుగుతున్నట్టు అంచనా. బిట్ కాయిన్ వినియోగం వల్ల అనైతిక ద్రవ్య వినియోగాన్ని అరికట్టడం సాధ్యం కాని పని. బిట్ కాయిన్ మాధ్యమం ద్వారా జరిగే ట్రాన్సక్షన్ లో ఏ వ్యక్తి చెల్లించాడు , ఏ వ్యక్తికి చెల్లించాడు అన్న సమాచారం పొందడం కుదరదు కాబట్టి ఇండియా లో బ్లాక్ మనీ అరికట్టడం కుదరని పని. అందుకే దీనిపై త్వరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిది అని సుప్రీం కోర్టు RBI కి సూచించింది. దీనిని అనుమతించకూడదు అనే భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *