Mobile Shopping Deals Uncategorized

RedMi Note 4 ధరలు తగ్గించిన షియోమి

ఇండియా లో దాదాపుగా 9 నెలల నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ RedMi Note 4. ఈ మొబైల్ 2GB + 16GB, 3GB+ 32GB, 4GB+64GB వెర్షన్ లలో లభిస్తుంది. దీపావళి సమయంలో RedMi Note 4 ధర దాదాపుగా 2,000 వరకూ షియోమి తగ్గించిన సంగతి తెలిసిందే.

తాజాగా షియోమి ఈ మొబైల్ ధరని ఆఫర్ లా కాకుండా మామూలుగానే ధర తగ్గించింది. షియోమి కంపెనీ నుంచే కొద్దిరోజుల క్రితం సెల్ఫీ కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన మొబైల్ #RedMiY1 దాదాపుగా #RedMiNote4 ఫీచర్లే ఉండడం,అదీ కాక ధర తక్కువగా ఉండడం తో షియోమి ఈ నిర్ణయం తీస్కున్నట్లు తెలుస్తుంది. RedMi note 4 లో 3GB అలాగే 4 GB ల ధరల్ని 1,000 రూపాయలు తగ్గించి 3GB వెర్షన్ ని 9,999 రూపాయలకు , 4 GB వెర్షన్ ని 11,999 రూపాయలకు అమ్మడానికి నిశ్చయించింది. ఈ ధర మార్పు ఈ రోజు నుంచే ఫ్లిప్ కార్ట్ మరియు MI అధీకృత వెబ్ సైట్ లలో మొదలవుతుంది.

Buy Here : http://fkrt.it/7jhWY!NNNN

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *